Tuesday, November 19, 2024

TS | ఇంటర్‌ వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు విడుదల.. నవంబర్‌ 14 వరకు గడువు

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: ఇంటర్‌ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కోర్సులకు సంబంధించి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్మీడియట్‌ బోర్డు గురువారం విడుదల చేసింది. వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థుల నుంచి ఫీజు స్వీకరించాలని ఆయా జూనియర్‌ కళాశాలలకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 20 వరకు అవకాశం కల్పించింది. ఈ నెల 26వ తేదీ నుంచి నవంబర్‌ 14వ తేదీ వరకు విద్యార్థులు ఫీజు చెెల్లించాలని సూచించింది.

రూ.100 ఆలస్య రుసుంతో నవంబర్‌ 16 నుంచి 23వ తేదీ వరకు, నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 4వ తేదీ వరకు రూ. 500 ఆలస్య రుసుంతో, డిసెంబర్‌ 6 నుంచి 13 వరకు రూ.1000 ఆలస్య రుసుంతో, డిసెంబర్‌ 15 నుంచి 20వ తేదీ వరకు రూ.2 వేల ఆలస్య రుసుంతో ఫీజు చెల్లించేందుకు అధికారులు అవకాశం కల్పించారు.

- Advertisement -

ఫస్టియర్‌ రెగ్యులర్‌ విద్యార్థులు రూ.510, ఒకేషనల్‌ రెగ్యులర్‌ విద్యార్థులు రూ.730, సెకండియర్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు రూ. 510, సైన్స్‌, ఒకేషనల్‌ విద్యార్థులు రూ. 730 చొప్పున ఫీజు చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement