హైదరాబాద్, ఆంధ్రప్రభ: రేపటి (సోమవారం) నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్ బోర్డు పూర్తిచేసింది. ఈనెల 20 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు పరీక్షలు రాసేందుకుగానూ 933 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 4,12,325 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
ఇందులో 2,70,583 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలు రాయనుండగా, 1,41,742 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి.