మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మునుగోడుతోపాటు నగరంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. మునుగోడు వైపు వెళ్లే వాహనాలను టోల్ ప్లాజాల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇట్టికే పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మరోసారి హైదరాబాద్‌లో భారీగా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. డబ్బును తరలిస్తున్నారనే సమాచారంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 71లో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ కారులో రూ.89.92 లక్షల నగదును గుర్తించారు. అయితే ఆ మొత్తానికి సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో దానిని స్వాధీనం చేసుకున్నారు. డబ్బు తరలిస్తున్న వ్యక్తిని విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా నగరంలో పోలీసుల తనిఖీల్లో నిర్వహిస్తుండగా.. పంజాగుట్టలో రూ.70 లక్షలు, బేగంబజారులో రూ.48.50 లక్షలు, నగర శివార్లలో మరో రూ.45 లక్షలు పట్టుబడ్డాయి. నగరంలో మొత్తం రూ.20 నుంచి 26 కోట్ల మేర అక్రమంగా తరలిస్తున్న నగదు పట్టుబడం గమనార్హం.
నగరంలో ముమ్మరంగా పోలీసుల తనిఖీ.. జూబ్లీహిల్స్ లో రూ.89.92 లక్షల నగదు స్వాధీనం
Advertisement
తాజా వార్తలు
Advertisement