Friday, November 22, 2024

వరద బాధితులకు సహాయక చర్యలు వేగవంతం చేయండి : పంచాయతీ రాజ్ కమిషనర్

బూర్గంపహాడ్ మండలం మొరంపల్లి బంజర్ గ్రామంలో స్టెల్లా మెరిస్ పాఠశాల నందు గోదావరి వరద ముంపు ప్రాంతాల ప్రజలకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని గోదావరి ఫ్లడ్స్ స్పెషల్ అధికారులు, పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంతరావు, ఆర్డివో వెంక రెడ్డి, బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోదావరి వరదలపై తక్షణ సమాచారం తెలియజేసేందుకు జిల్లా కలెక్టర్ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించి.. పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాధితులకు సహాయక చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. వరదలు తగ్గేవరకు ప్రయాణాలను రద్దు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో విద్యాలత, స్థానిక సర్పంచ్ భూక్యా దివ్యశ్రీ, స్థానిక టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు కైపు ఖగేందర్ రెడ్డి, రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ పరమేష్, ఆంధ్రప్రభ విలేకరి జక్కిరెడ్డి మల్లారెడ్డి, గాదె నర్సిరెడ్డి, పలు శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement