Monday, November 18, 2024

ఓర్నీ.. ఇట్లగుడ చేస్తరా.. ఫుట్​బాల్​ మ్యాచ్​లో డిష్యుం డిష్యుం!

మెక్సికో ఫుట్‌బాల్‌ లీగ్‌లో విషాదం చోటు చేసుకుంది. లీగ్‌లో భాగంగా క్వెరెటారో, అట్లాజ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ రణ రంగాన్ని తలపించింది. ఇరు జట్ల ఆటగాళ్లు విజయం కోసం మైదానంలో పోరాడుతుంటే.. గ్యాలరీలోని ప్రేక్షకులు రెండు వర్గాలుగా విడిపోయి చితక్కొట్టుకున్నారు. పిడి గుద్దులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్టేడియంలోని కుర్చీలతో రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. మెక్సికోలోని లా కొర్రెగిడోరా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 62 నిమిషంలో స్టేడియంలో ఒక్కసారిగా అలజడి ప్రారంభమైంది. భద్రతా సిబ్బంది ఉన్నా.. గొడవను నిలువరించలేకపోయారు. ఒకరిద్దరి మధ్య చిన్నగా ప్రారంభమైన వాదన.. భీకర ఘర్షణకు దారితీసింది. చేతికి ఏది దొరికితే దాంతో దాడులు చేసుకున్నారు. దాదాపు 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. దీంతో మ్యాచ్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు.

తీవ్రంగా స్పందించిన ఫిఫా..

ఈ ఘటనపై స్పందించిన ఫిఫా అధికారులు.. తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. బాధితులకు సత్వర న్యా యం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చా రు. ఇక ఘర్షణ సమయంలో మానిటర్‌ ధ్వంసమైంది. తమ ఆటగాళ్లు, అభిమానుల భద్రతకు అత్యధిక ప్రాధా న్యత ఇస్తామని మ్యాచ్‌ నిర్వాహకులు వెల్లడించారు. అందరూ కలిసి ఒకేసారి దాడికి పాల్పడటంతో వారిని సెక్యూరిటీ సిబ్బంది అదుపు చేయలేకపోయారన్నారు. ఫలితంగా ఈ ఘటన జరిగిందన్నారు. మ్యాచ్‌ చూ స్తున్న అభిమానులు తీవ్ర భయాందోళనకు గురయ్యా రని, పరిస్థితి చేజారిపో తుండటంతో వారు భయంతో పరుగులు తీశారని వివరించారు. మహిళలు, పిల్లలు స హా అభిమానులు స్టాండ్స్‌ నుంచి తప్పించుకునేందుకు వీలుగా మైదానంలోకి గేట్లు తెరిచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement