దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడి జరగొచ్చని ఆ రాష్ట్ర పోలీసులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. డ్రోన్లతో దాడి జరగవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15కు ముందే దాడి జరగవచ్చని అలర్ట్ చేశాయి. టెర్రరిస్టులు, సంఘ విద్రోహశక్తులు దాడులకు పాల్పడవచ్చని వివరించాయి. కాగా ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు.
కాగా ఇటీవల కశ్మీర్ సరిహద్దుల్లో గుర్తుతెలియని డ్రోన్ల సంచారం అధికమైంది. జమ్మూలోని ఎయిర్ ఫోర్స్ స్థావరం వద్ద డ్రోన్ దాడి తీవ్ర కలకలం రేపింది. దాంతో కేంద్రం సరిహద్దు ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలను మోహరించింది.
ఈ వార్త కూడా చదవండి: అత్తకు బాయ్‌ఫ్రెండ్ కావాలని కోడలి ప్రకటన