Sunday, November 17, 2024

TG | స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఇంటిగ్రేటెడ్‌ డివిజన్‌ లెవల్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ కేంద్రంలో సమీకృత డివిజనల్‌ స్థాయి ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్‌ (ఇంటిగ్రేటెడ్‌ డివిజినల్‌ లెవెల్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌) నిర్మాణానికి రూ. 26 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోకవర్గ కేంద్రంలో ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్‌ డివిజినల్‌ లెవెల్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలు చేపట్టాలని ఆర్‌ అండ్‌ బీ శాఖ కోరింది. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు ఒకేచోట అందించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement