ప్రభ న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ… దేశంలోనే మొదటి సారీ కమ్యూనికేషన్ ఆధారిత రైలు నియంత్రణ సాంకేతిక పరిజ్ఞానం… భద్రత కోసం కోచ్‌లలో వీడియో కెమెరాలు… స్టేసన్లలో సీసీ కెమెరాలు… తమంతట తామే తెరుచుకునే తలుపులతో కూడిన ఎసీ బోగీలు… ఆధునిక విమానాశ్రయాలను పోలిన రైల్వేస్టేషన్లు… హైదరాబాద్ మెట్రో ప్రత్యేకతలు.. ప్రపంచంలోని ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రోగా గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రోను సాంకేతిక కష్టాలు వీడటం లేదు. వేగంగా నడుస్తున్న రైళ్లు ఒక్క కుదుపుతో ఆగిపోతున్నాయి. గడిచిన నెలరోజుల్లో మెట్రో పరిధిలోని నాగోల్-రాయదుర్గం, మియపూర్-ఎల్బీనగర్, ఇవ్లీుబన్- జేబీఎస్ మొత్తం మూడు కారిడార్లలో 10సార్లకు పైగా రైళ్లు ఆగిపోయాయి. దాంతో ఆయా కారిడార్ల పరిధిలో తర్వాత నడిచే సర్వీసులను రద్దు చేస్తున్నారు. ఫలితంగా గంటల తరబడి ప్రయాణికులు రై ళ్లు, రైల్వేస్టేషన్లలో పడిగాపులు పడటం సర్వసాధారణమైంది. ఒక కారిడార్ నుంచి మరో కారిడార్‌కు మారే ప్రయాణికులు నానా కష్టాలు పడుతున్నారు.
అడుగడుగునా భద్రతా లోపాలు..
24/7 సీసీ కెమెరాల నిఘా, నిత్యం భద్రతా సిబ్బంది పహరా మద్య రైళ్ల రాకపోకలు అని చెపుతున్న మెట్రోలో భద్రతా లోపాలు అడుగడుగునా వెలుగు చూస్తున్నాయి. మెట్రోరైల్ భద్రతా వ్యవస్థను దాటుకుని ఒకరు రైలు పట్టాలపై పడుకుంటే, మరోకరు ఏకంగా రైల్వేస్టేషన్లోనే పాటలకు స్టేప్పులేస్తూ డ్యాన్సులు చేస్తారు. ఇక నగరంలోని మెట్రోస్టేషన్లు ఎక్కి ఆత్మహత్యలకు పాల్పడటం తరుచూ జరుగుతూనే ఉంది. మద్యం సేవించి రైళ్లు ఎక్కడం, వృద్దులు, స్త్రీలకు కేటాయించిన కంపార్ట్‌మెంట్లో ఇతరులు కూర్చోవడం పరిపాటిగా మారింది. ప్రారంభంలో నిక్కచ్చిగా వ్యవహరించిన సిబ్బంది ఇలాంటి సంఘటనలను చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.