ఇప్పటికే మార్కెట్‌లో పలు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎన్నో ఆఫర్లతో జనాలను వెంటపడి, వేధించి ప్రీమియంలు కట్టించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎస్‌బీఐ మాత్రం తమ ఖాతాదారులకు ఫ్రీ ఇన్సూరెన్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో చదివి తెలుసుకోండి..
పాలసీ చార్జీలు అధికం అవుతున్న ఈ రోజుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మంచి ఆఫర్ వచ్చింది. తమ బ్యాంకులో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతా ఉన్న వారికి ఫ్రీగానే రూ. 2 లక్షల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఆఫర్ అందిస్తోంది ఎస్‌బీఐ. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ ఉచితంగా పొందాలంటే చేయాల్సిందల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాను తెరవడమే.
అంతేకాకుండా ఎస్‌బీఐ రూపే కార్డు.. జన్ ధన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రీ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. 2018 ఆగస్టు 28వ తేదీ కంటే ముందు తమ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్నవారికి ఈ కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టంచేసింది.
ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం ఎలా ?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్బీఐ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారం నింపడంతో పాటు ఖాతాదారుడి డెత్ సర్టిఫికెట్‌ని జతచేస్తూ అప్లై చేసుకోవాలి. ఇవే కాకుండా యాక్సిడెంట్‌కి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ, పోస్ట్ మార్టం రిపోర్ట్, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ (ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ నివేదిక), చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు కూడా జతచేయాల్సి ఉంటుంది. యాక్సిడెంట్ అయిన 90 రోజుల్లోపే ఈ డాక్యుమెంట్స్ అన్నీ అందజేస్తే బాధిత కుటుంబానికి ఇన్స్యూరెన్స్ అందిస్తారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily