Saturday, November 23, 2024

ఆర్థిక ప్రణాళికల్లో ఇన్సూరెన్స్‌ చాలా ముఖ్యం : ఎస్‌బీఐ లైఫ్‌ సర్వే

ఆర్థిక ప్రణాళికల్లో ఇన్సూరెన్స్‌ అత్యంత ముఖ్యమైనదని 78 శాతం మంది భారతీయులు భావిస్తున్నారు. ఎస్‌బీఐ లైఫ్‌ నిర్వహించిన ఫైనాన్సియల్‌ ఇమ్యూనిటీ సర్వే 2.0లో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. దేశంలోకి కరోనా అడుగుపెట్టిన మార్చి 2020 తర్వాత 44 శాతం మంది భారతీయులు తొలిసారి లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను కొనుగోలు చేశారు. ఇక 46 శాతం మంది భారతీయులు మొదటిసారి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు పొందారు. భౌతికంగా రోగనిరోధక శక్తిని పొందాలని 80 శాతం మంది భారతీయులు భావిస్తుండగా అందులో 74 శాతం మంది ఇప్పటికే రెండు డోసుల కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేయించుకున్నారు. ఇక భారతీయుల టాప్‌ -3 ఆందోళనల విషయానికి వస్తే.. మెడికల్‌ లేదా చికిత్స వ్యయాలు పెరిగిపోయాయని 59 శాతం మంది భారతీయులు అన్నారు.

ఉద్యోగాల్లో స్థిరతంలేదని 59 శాతం మంది, వ్యక్తిగత, కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై 58 శాతం కలవరపడుతున్నారు. భౌతికంగా ఆరోగ్యంగా ఉండే ఫైనాన్సియల్‌గానూ దృఢంగా ఉన్నట్టేనని 57 శాతం మంది భారతీయులు చెప్పారు. జనవరి 2021 తరాత ప్రతి నలుగురు భారతీయుల్లో ముగ్గురు తమ సేవింగ్స్‌ను పెంచారు. అందులో 50 శాతం మంది సేవింగ్స్‌ లేదా ఇన్వెస్ట్‌మెంట్స్‌ లేదా ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెడుతున్నారు. జీవితంలో కీలకమైన మైలురాళ్లను సాధించిన తర్వాత లైఫ్‌ కవర్‌ను పెంచుకుంటూ పోవాలని 70 శాతం మంది భారతీయులు భావిస్తున్నారని ఎస్‌బీఐ లైఫ్‌ సర్వేలో వెల్లడైంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement