Saturday, November 23, 2024

రైత‌న్న‌ల‌కు బీమా ప‌రిహారం-బ‌ట‌న్ నొక్కి రైతుల ఖాతాల్లోకి న‌గ‌దు జ‌మ‌

అన్నదాతలకు అండగా నిలుస్తూ… డా.వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద వరుసగా మూడవ ఏడాది 2021 ఖరీఫ్ పంట నష్టపోయిన రాష్ట్రంలోని 15.61 లక్షల మంది రైతన్నలకు ఈ ఖరీఫ్ ప్రారంభంలోనే రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీసత్య సాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో బటన్ నొక్కి .. బీమా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు.అన్నమయ్య జిల్లాలోని 80,100 మంది రైతులకు రూ.60.16కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ అయ్యాయి. గ్రామంలోని ఆర్బీకేల ద్వారా పంట వేసినప్పుడే ఈ – క్రాప్ లో నమోదు చేయించి రైతులకు రసీదు ఇవ్వడంతోపాటు.. అర్హులు ఎవరు మిగిలిపోకుండా పంట నష్టాల అంచనా.. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయంలో సామాజిక తనిఖీల్లో భాగంగా అర్హుల జాబితాను ప్రదర్శిస్తామ‌న్నారు.వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద 2019-20 సంవత్సరంలో రూ.1,252 కోట్లు, 2020-21 సంవత్సరంలో రూ .1,739 కోట్లు, 2021-22 సంవత్సరంలో రూ. 2,977 కోట్లు మొత్తంగా 3 సంవత్సరాలలో 44.28 మంది రైతులకు రూ.6,684 కోట్ల పరిహారాన్ని చెల్లించింది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో… వివిధ పథకాల ద్వారా రైతులకు ఇప్పటి వరకు రూ.1,28,171 కోట్ల లబ్ధి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేకూరింది.అన్నమయ్య జిల్లా కోడూరు తాసిల్దారు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి కార్యక్రమంలో.. జిల్లా కలెక్టర్ గిరీషా పిఎస్, రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ సుకుమార్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి సభ్యులు తదితరులు పాల్గొని.. అన్నమయ్య జిల్లాలోని 80,100 మంది రైతులకు సంబంధించిన డా. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారం రూ.60.16కోట్లు మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఆర్డిఓ కోదండ రామిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి ఉమామహేశ్వరమ్మ, ఉద్యానవన శాఖ ఏడి రవీంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఎంపిపిలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement