Saturday, November 23, 2024

Insurance | వరద బాధితులకు అండగా నిలవండి.. కేంద్ర ఆదేశం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించినందు వల్ల వ‌ర‌ద బాధిత ప్రజలకు సాధ్యమైనంత మేరకు పూర్తి మద్దతివ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బీమా కంపెనీలకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. వర్షాలు, వరదల వల్ల నష్టానికి గురైన వారు కోరిన పరిహారాన్ని వెంటనే చెల్లించాలని సూచించారు.

అందుకోసం ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ప్రజలు కోరిన విధంగా వెంటనే వారి క్లెయివ్లును పరిష్కారించి సత్వర సహాయం పొందే మార్గాన్ని సులభతరం చేయాలని పూర్కొంది. పాలసీదారులు సంప్రదించేందుకు వీలుగా నోడల్‌ అధికారుల పేర్లు, వారి కాంటాక్ట్‌ నెంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్రం బీమా కంపెనీలకు తెలిపింది.

ఈ ప్రకృతి వైపరీత్యాలకు గురైన వారందరికీ అవసరమైన సహాయాన్ని అందించి అండగా నిలిచేలా మద్దతిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టు-బడి ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక టీ-్వట్లో పేర్కొంది. బీమా కంపెనీలు విధిగా భావించి సాయమందేంచేలా ముందుండాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement