సాంకేతిక వినియోగాన్ని మరింత విస్తృతం చేసేదిశగా శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా విపత్తు సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా తమ ప్రయోగాలకు పదునుపెడుతున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సరికొత్త రోబో ర్యాట్ (ఎలుక) ఆవిష్కరణకు చైనాలోని బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ప్రొఫెసర్ క్వింగ్ షి బృందం కృషిచేస్తోంది. తద్వారా ఇరుకైన ప్రదేశాల్లోకి వేగంగా చొచ్చుకెళ్లి మనుషుల ఆచూకీని గుర్తించడం సాధ్యమవుతుంది.
ఇప్పటికే రోబోటిక్ ఎలుక నమూనాను డిజైన్ చేశారు. దాని శరీరపరిమాణం, రూపాన్నిబట్టి కాళ్లలో, నడుము, తలభాగంలో 2 డిగ్రీల వంపునుకు వీలుగా స్ప్రింగ్ నమూనా సిద్ధంచేశారు. దీనికి సంబంధించిన నివేదిక ఐఈఈఈ ట్రాన్సాక్షన్ జర్నల్లో ప్రచురితమైంది. దీని బరువు 220 గ్రాములు. మొదట చక్రాల నమూనా డిజైన్చేశారు. అయితే, కదలిక చురుకుదనాన్ని మరింత మెరుగు పరచడానికి చక్రాలకు బదులుగా కాళ్లను అమర్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..