మెటా కంపెనీకి చెందిన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్.. తన యూజర్స్ ఎక్స్‌పీరియన్స్‌ని మెరుగు పరిచేందుకు టెక్నికట్ & ప్రైవసీ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ మద్య కాలంలో చాలానే ఫీచర్లను పరిచయం చేసింది. ఇక తాజాగా మరో కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొస్తోంది ఇన్స్టాగ్రామ్. యూజర్స్ ప్రైవసీ కోసం రీడ్ రిసిప్ట్స్ డిసేబుల్ చేసుకునే ఆప్షన్ ని తీసుకురానుంది.
కాగా, ఈ స్పెసిఫికేషన్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. దీనితో డైరెక్ట్ మెసేజ్‌లలో రీడ్ రిసిప్ట్స్ డిసేబుల్ చేసుకోవచ్చు. అంటే ఇన్‌బాక్స్‌లో (డీఎం) లో ఏదైనా రిసీవ్డ్ మెసేజ్ చూసినా.., అది చూసినట్లు పంపిన వారికి తెలియదు. వారికి తెలియకుండానే పంపిన మెసేజ్‌లన్నీ సీక్రెట్‌గా చదువుకోవచ్చు.
మరో కొత్త ఫీచర్స్..
ఇన్స్టాగ్రామ్ జోడిస్తున్న మరో కొత్త ఫీచర్ రీల్స్‌కు సాంగ్ లిరిక్స్ యాడ్ చేసుకునే ఆప్షన్. యూజర్లు మ్యూజిక్ లైబ్రరీ నుంచి పాటను ఎంచుకుని, రీల్లో చూపించాలనుకుంటున్న లిరిక్స్ ఎంచుకోవడానికి లెఫ్ట్ సైడ్‌కు స్వైప్ చేయాల్సి ఉంటుంది. ఇది స్టోరీస్ ఫీచర్‌కు ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫీచర్‌ను పోలి ఉంటుంది. ఈ కొత్త ఫీచర్లు ఇన్స్టాగ్రామ్ మెసేజింగ్, వీడియో సామర్థ్యాలను మెరుగుపరచడానికి మెటా తీసుకొస్తోంది.