టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్య తన భార్య నటాషా స్టాంకోవిచ్ నుంచి విడిపోతున్నాడంటూ గత కొద్దికాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నటాషా తాజాగా పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
”జీవితంలో కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరిగా ఉంటాం… నిరుత్సాహపడతాం… అలాంటివేళ ఎవరూ తోడుగా లేరని బాధ పడనవసరం లేదు. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. మనకు ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. దాని గురించి భగవంతుడి వద్ద ఓ ప్రణాళిక ఉంటుంది” అంటూ నటాషా ఓ వీడియోను పోస్టు చేశారు. ఇటీవల నటాషా తన ఇన్స్టా ఖాతాలో పాండ్యతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను తొలగించారు. కేవలం కుమారుడితో ఇద్దరూ ఉన్న చిత్రాలను మాత్రమే ఉంచడంతో విడాకుల రూమర్స్ మొదలయ్యాయి.
Insta | అన్నింటికి దేవుడే ఉన్నాడు… పాండ్యా సతీమణి షాకింగ్ పోస్ట్
Advertisement
తాజా వార్తలు
Advertisement