దేశంలోని వివిధ ఔషధ తయారీ యూనిట్లలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో), రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉమ్మడి తనిఖీలు చేపట్టనున్నాయి. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదేశాల మేరకు తనిఖీలు జరపనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం, దేశవ్యాప్తంగా ఉమ్మడి తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం, 1940 నిబంధనలకు అనుగుణంగా ఉండేలా తనిఖీ, రిపోర్టింగ్, తదుపరి చర్యల ప్రక్రియను పర్యవేక్షించ డానికి సీడీఎస్సీవోలో ఇద్దరు జాయింట్ డ్రగ్స్ కంట్రోలర్తో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
దేశంలో తయారయ్యే ఔషధాలకు సంబంధించి అధిక నాణ్యత ప్రమాణాలను పాటించేలా ఉమ్మడి తనిఖీని నిర్వహిస్తు న్నారు. నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ లేదా కల్తీ లేదా నకిలీ ఔషధాల తయారీని గుర్తించేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు. ఔషధాల భద్రత, సమర్థత, నాణ్యతను నిర్ధారించడం ఔషధ నియంత్రణ లక్ష్యం.