Tuesday, November 26, 2024

తిరుమ‌ల‌ లడ్డూ కౌంటర్లలో తనిఖీలు..

తిరుమల, ప్రభన్యూస్‌ : తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో కొలతలు, తూనికలు శాఖ అధికారులు శుక్రవారం అకస్మిక తనిఖీలు నిర్వహించారు. వెంకన్న భక్తులకు ఎంతో ప్రీతిపాత్రంగా భావించే మహాప్రసాదమైన లడ్డూ బరువు తక్కువగా ఉందంటూ ఓ భక్తుడు వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయడంతో తూనికలు, కొలతలశాఖ అధికారులు లడ్డూ కౌంటర్లను తనిఖీలు చేశారు. ఈ మేరకు శ్రీవారి లడ్డూ ప్రసాదమైన లడ్డూ బరువు 160 గ్రాముల నుంచి 180 గ్రాములు ఉండాల్సి ఉండగా, నిన్న ఓ భక్తుడు లడ్డూలు తీసుకునే సమయంలో కేవలం 90 గ్రాముల నుంచి 110 గ్రాముల లోపే బరువు ఉండడాన్ని వీడియో రూపంలో సోషల్‌ మీడియాలో పెట్టి ప్రశ్నించాడు.

లడ్డూ కౌంటర్ల వద్దకు చేరుకున్న అధికారులు పలు కౌంటర్లలో లడ్డూల బరువును తనిఖీ చేయగా, ప్రతి లడ్డూ దాదాపు 160 గ్రాముల నుంచి 180 గ్రాముల వరకు ఉండడాన్ని అధికారులు గుర్తించారు. లడ్డూ బరువు తక్కువగా ఉందంటూ భక్తుడి పిర్యాదుతో తనిఖీలు నిర్వహించామని, లడ్డూ బరువు 170 నుంచి 190 గ్రాముల మధ్య ఉందని తూనికలు, కొలతల శాఖ డిప్యూటి కంట్రోలర్‌ దయాకర్‌రెడ్డి తెలిపారు. వేయింగ్‌ మిషన్‌లో సాంకేతిక లోపం కారణంగానే నిన్న లడ్డూ బరువు తక్కువగా చూపించిందన్నారు. ఎప్పుడు కూడా లడ్డూ బరువు తక్కువగా లేదని అన్నారు. ఇక పై అప్పుడప్పుడు లడ్డూ కౌంటర్లలో తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement