Friday, November 22, 2024

అతిపెద్ద డేటా సైన్స్‌ ఫ్యాకల్టీగా నిలిచిన అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : భారతదేశంలో అగ్రగామి డాటా సైన్స్‌ ఇనిస్టిట్యూట్‌ కావడంతో పాటుగా ఎడ్‌టెక్‌ అగ్రగామి అప్‌గ్రాడ్‌కు 100శాతం అనుబంధ సంస్ధ అయిన అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌ ఇప్పుడు ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఎడ్‌టెక్‌ సంస్ధగా డాటా సైన్స్‌ అండ్‌ ఏఐ డిపార్ట్‌మెంట్‌లలో పూర్తిగా అంకితం చేయబడిన ఫ్యాకల్టీతో నిలిచింది. ఈసందర్భంగా అప్‌గ్రాడ్‌ ఇన్సోఫీ అధ్యక్షుడు డాక్టర్‌ వెంకటేష్‌ సుంకడ్‌ మాట్లాడుతూ…. శక్తివంతమైన అంతర్గత నైపుణ్యంతో పాటుగా, పరిశ్రమ, అకాడెమియా, ఆర్‌ అండ్‌ డీ, వ్యవస్ధాపకత, ఉత్పత్తి పరిజ్ఞానాన్ని తమ కరిక్యులమ్‌, బోధనా విధానంలో జోడించడానికి, అభ్యాసకులకు పూర్తి అంకితభావంతో మద్దతునందించేందుకు ఇది తమకు సహాయ పడుతుందన్నారు.

అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌ కో-ఫౌండర్‌ అండ్‌ సీఈవో డాక్టర్‌ దక్షిణామూర్తి వి కొల్లూరు మాట్లాడుతూ… అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌ స్థిరంగా తమ ఫ్యాకల్టీని డాటా సైన్స్‌, ఏఐ, ఎంఎల్‌ విభాగాల్లో విస్తరిస్తోందన్నారు. అప్‌గ్రాడ్‌ కో-ఫౌండర్‌ అండ్‌ ఎండీ మయాంక్‌ కుమార్‌ మాట్లాడుతూ… అప్‌గ్రాడ్‌ ఇన్సోఫ్‌ ద్వారా తాము విస్తృత స్ధాయిలో తమ అభ్యాసకులకు స్పెషలైజేషన్స్‌ను తీసుకురావడంతో పాటుగా వారి డొమైన్‌ ఫౌండేషన్‌ బలోపేతం చేసుకోవడంలో సహాయపడుతున్నామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement