Friday, November 22, 2024

TS | సుప్రీంలో క‌విత‌పై విచార‌ణ 28కి వాయిదా..

న్యూఢిల్లీ : దర్యాప్తు సంస్థలు మహిళలను ఇంట్లోనే విచారించాలనే అంశంపై భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. మద్యం కేసులో విచారణకు రావాలని ఈడీ జారీ చేసిన నోటీసులను గతేడాది కవిత సవాలు చేశారు. గతంలో ఆమె పిటిషన్‌ను నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో జత చేసిన విషయం తెలిసిందే. పిటిషన్లపై విడివిడిగానే విచారణ చేపట్టనున్నట్లు శుక్రవారం జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. 3 కేసులు వేర్వేరు అని, కలిపి విచారణ చేయడం సబబు కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement