Monday, November 18, 2024

Inner Ring Road Case – ఢిల్లీలో ఉన్నా నిన్ను వద‌లా….నారా లోకేష్ కు 41 ఎ నోటీస్….ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

అమ‌రావ‌తి – ఇన్న‌ర్ రింగ్ రోడ్డు స్కామ్ వ్య‌వ‌హారంలో 14వ నిందితుడిగా ఉన్న‌టిడిపి జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ కు నోటీసులిచ్చేందుకు ఎపి సిఐడి బృందం నేడు ఢిల్లీకి బ‌య‌లుదేరింది.. టిడిపి అధినేత చంద్ర‌బాబు అరెస్ట త‌ర్వాత ఢిల్లీలో ఉంటున్న నారా లోకేష్ వ‌చ్చే నెల మూడో తేది వ‌ర‌కు అమ‌రావ‌తికి తిరిగి వ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోడంతో సిఐడి అధికారులు ఢిల్లీ వెళ్లి 41ఎ నోటీస్ ఇచ్చేందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.. దీంతో ఆరుగురు స‌భ్యుల సిఐడి బృందం నేటి ఉద‌యం ఢిల్లీకి వెళ్లింది.

లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్పోజ్ చేసిన హైకోర్టు

ఇది ఇలా ఉంటే ఎపి హైకోర్టులో నారా లోకేష్ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ నేడు వాద‌న‌లు కొన‌సాగాయి.. ప్ర‌భుత్వ త‌రుపున ఎజి త‌న వాద‌న‌లు వినిపిస్తూ, నారా లోకేష్ ను విచారించేందుకు వీలుగా 41 ఎ నోటీస్ జారీ చేస్తామ‌ని హైకోర్టు దృష్టికి తెచ్చారు.. దీంతో లోకేష్ అరెస్ట్ అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో నారా లోకేష్ పిటిష‌న్ ను హైకోర్టు కొట్టివేసింది.. ఇదే సందర్భంగా సిఐడి విచారణకు సహకరించవలసిందిగా నారా లోకేష్ ను అదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement