రాష్ట్రంలో సీఎం జగన్ కమ్మ వర్గానికి అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఘాటైన వ్యాఖ్యలు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నిర్వహించిన కమ్మవారి వనభోజనాల కార్యక్రమానికి మాజీ మంత్రి హాజరయ్యారు. నందిగామ మండలం ఐతవరం గ్రామంలో ఆయన నివాసంలో మాజీ మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నేను ఎన్టీఆర్ మంత్రి వర్గంలో మంత్రిగా పని చేసిన.. ఆయన మంత్రి వర్గంలో వారిని ఎంతో గౌరవించే వారు అన్నారు. ఎన్టీఆర్ వర్సిటీ ప్రారంభంలో నేను పాల్గొన్నాను అక్కడ శిలా ఫలకాల మీద నాపేరు, ఎన్టీఆర్ పేరు, అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి పేరు ఇప్పటికీ ఉన్నాయన్నారు. కానీ వ్యవస్థల పేర్లు మార్చిన చరిత్ర గతంలో లేదు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు విషయంలో ఎవరూ స్పందించకపోవడం శోచనీయం మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు మండిపడ్డారు. ఏపీ కేబినెట్ లో కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు లేకపోవడం దురదృష్టకరం అన్నారు. కమ్మవారి రాష్ట్రం అయ్యిండి, ఇక్కడ ఒక్క మంత్రి కూడా లేకపోవడం పక్కా రాష్ట్రాల్లో కమ్మవారికి ఎంతో మందికి మంత్రి పదవులు ఉన్నాయి అన్నారు.
రాష్ట్రంలో కమ్మ వర్గానికి అన్యాయం : మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు
Advertisement
తాజా వార్తలు
Advertisement