Friday, November 22, 2024

ఆరంభ లాభాలు ఆవిరి, ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయంతో బుధవారం నష్టాల్లోకి కూరుకుపోయిన స్టాక్‌ మార్కెట్లు.. గురువారం ఉదయం భారీ లాభాలతోనే ప్రారంభమయ్యాయి. కానీ చివరికి అమ్మకాలు వెల్లువెత్తడంతో ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్స్‌లో కనిపించిన కొనుగోళ్లతో కొంత ఊపందుకున్ను దేశీయ మార్కెట్లు మధ్యాహ్నం తరువాత.. మాత్రం డీలా పడ్డాయి. వరుసగా వెల్లువెత్తిన అమ్మకాలతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. ఉదయం 56,146 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ తరువాత.. బాగానే కోలుకుంది. ఒక దశలో 56,500 స్థాయిని దాటింది. మధ్యాహ్నం వరకు లాభాల్లోనే ఉన్నసూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ఇంట్రాడేలో గరిష్టాలతో పోలిస్తే.. 800 పాయింట్లు సెన్సెక్స్‌ నష్టపోయింది. చివరికి మార్కెట్లు ముగిసే సమయానికి 33.20 పాయింట్ల లాభంతో.. 55,702.23 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 5.10 పాయింట్ల లాభంతో 16,682.70 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని 30 షేర్స్‌లో 14 లాభపడగా.. 16 షేర్లు నష్టపోయాయి. ఇదే సమయంలో బ్యాంక్‌ నిఫ్టీ 32 పాయింట్లు పతనం అవ్వగా.. నిఫ్టీ మిడ్‌ క్యాప్‌ మాత్రం 30 పాయింట్ల లాభంతో ముగిసింది.
రాణించిన ఐటీ, పవర్‌
బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ 50 పాయింట్లకు పైగా క్షీణించాయి. మిడ్‌ క్యాప్‌లో ఏబీబీ, రుచి సోయా, అదానీ పవర్‌, ఇండ్యూరెన్స్‌, గుజరాత్‌ గ్యాస్‌, అశోక్‌ లేలాండ్‌, బీహెచ్‌ఈఎల్‌ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. అపోలో హాస్పిటల్స్‌, బయోకాన్‌, బ్యాంక్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌, ఎక్సైడ్‌ ఇండియా, టాటా కన్జ్యూమర్‌ కంపెనీల షేర్లు క్షీణించాయి. నిఫ్టీలో టెక్‌ మహీంద్రా, హీరో మోటోకార్ప్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో షేర్లు లాభపడ్డాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్‌ ్ట ్స, బ్రిటానియా, నెస్లే ఇండియా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. పవర్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, ఐటీ రంగాల షేర్లు 1-2 శాతం లాభపడగా.. రియాల్టిd, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్లు 0.5-1.5 శాతం మేర నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement