Tuesday, November 19, 2024

ఫ్రెషర్లకు షాక్‌ ఇచ్చిన ఇన్ఫోసిస్‌..

ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న ఫ్రెషర్లకు కంపెనీ షాక్‌ ఇచ్చింది. అసెస్‌మెంట్‌ పేరుతో ఇన్ఫోసిస్‌లో జరిగే అంతర్గత పరీక్షలో విఫమమైన వారిని ఉద్యోగాల నుంచి తొలగించింది. పరీ క్షలో ఫెయిల్‌ అయినందుకు ఉద్యోగం నుంచి తొలగించినట్లు కంపెనీ వీరికి సమాచారం ఇచ్చింది. గత కొద్ది నెలల్లోనే సంస్థ 600 మందిని ఉద్యోగం నుంచి తొలగించింది. గత నెలలో ఎఫ్‌ఏ టెస్ట్‌లో ఉత్తీర్ణులు కాలేకపోయిన 280 మంది ఉద్యోగాలు కోల్పోయారు.

ఈ నెల మొదటివారంలో జరిగిన టెస్టుకు 150 మంది హాజరయ్యారు. వీరిలో 90 మంది ఉత్తీర్ణులు కాలేక , ఉద్యోగాలు కోల్పోయారు. 2022 జులై నాటి బ్యాచ్‌లో 85 మంది ఫ్రెషర్లను ఇన్ఫోసిస్‌ ఈ కారణంతోనే తొలగించింది. తాము ఉద్యోగాలు కోల్పోవడానికి టెస్ట్‌లో పెయిల్‌ కారణం కాదని ఫ్రెషర్లు చెబుతున్నారు. సంస్థ ప్రతినిధులు మాత్రం ఈ వాదనను తోసిపుచ్చారు. మరో వైపు ఇన్ఫోసిస్‌ నుంచి ఆఫర్‌ లెటర్లు పొందిన అనేక మంది ఎనిమిది నెలలుగా సంస్థలో చేరేందుకు పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు.

విప్రో లోనూ ఇదే పరిస్థితి

మరో ప్రముఖ ఐటీ సంస్థ విప్రో కూడా కొన్ని వారాల క్రితమే 452 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. వీరి పనితీరు బాగలేదన్న కారణంతో వీరిని ఇంటికి పంపించింది. ఇలా విప్రోలో ఉద్యోగం కోల్పోయిన ఫ్రెషర్ల సంఖ్య 800 వరకు ఉంటుంది.
జనవరి నుంచే మన టెెక్‌ కంపెనీలు భారీగా ఉద్యోగులు తొలగిస్తున్నాయి. ఒక్క జనవరిలోనే టెక్‌ కంపెనీలు అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి బడా కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలా ఒక్క జనవరిలోనే లక్ష మంది ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. అమెజాన్‌ 18 వేల మందిని, గూగుల్‌ 12 వేల మందిని, మైక్రోసాఫ్ట్‌ 10 వేల మంది ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం తెల్సిందే…

Advertisement

తాజా వార్తలు

Advertisement