ప్రభన్యూస్ : బీ2బీ ఎగ్జిబిషన్స్ ఆర్గనైజర్ ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా రెండు రోజుల రెన్యువబుల్ ఎనర్జీ ట్రేడ్ ఎక్స్‌పో అయిన రెన్యూఎక్స్ 5వ ఎడిషన్‌ను ప్రకటించింది. ఇది హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నవంబర్ 19, 20వ తేదీల్లో జరగనుంది. ఇన్ఫార్మా మార్కెట్స్ ఇన్ ఇండియా రెన్యూఎక్స్ 2021 ద్వారా పునరుత్పాదక విభాగంలో వ్యాపార అవకాశాలకు సంబంధించి పరస్పరం అనుసంధానం అయ్యేందుకు, కలిసి పని చేసేందుకు విక్రేతలు, కొనుగోలుదారు లకు ఒక పారిశ్రామిక వేదికను అందిస్తోంది. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద షోలలో ఒకటైన రెన్యూఎక్స్ దక్షిణ భారతదేశ గ్రీన్ ఎకానమీ కమ్యూనిటీ అంతా ఒక్కచోటుకు చేరడానికి వేదిక కానుంది. పరిశ్రమ ధోరణులు, సవాళ్లు.. మార్కెట్ దృక్పథాలు లాంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు.
ఆర్‌ఈ రంగాలు, తయారీ సంస్థలు, ఈపీసీ కంపెనీలకు చెందిన విధాన నిర్ణేతలు, పీవీ మాడ్యూల్స్, హైబ్రిడ్ సిస్టమ్స్, మెటీరియల్స్ అండ్ ఎక్విప్‌మెంట్స్, ఇన్వర్టర్లు, చార్జ్ కంట్రోలర్స్, బ్యాటరీలు, టెస్టింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్స్, కాంపో నెంట్ తయారీదారులు, బయో ఎనర్జీ ఉపకరణాల తెలంగాణ స్టేట్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ షోకు నోడల్ ఏజెన్సీగా ఉంది.
నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండి యా, ఈఎస్‌ఈఏ, ఇండో జర్మన్ ఎనర్జీ ఫోరమ్ లాంటివి ఈ కార్యక్రమానికి అండగా నిలిచాయి. తొలి రోజున క్లోజ్ డోర్ సీఈఓ కాన్ క్లేవ్ జరగ నుంది. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ) అధ్యక్షత వహిస్తారు. తెలంగాణ ప్రభుత్వ ఎనర్జీ విభాగం మాజీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అజయ్ మిశ్రా సహా అధ్యక్షత వహిస్తారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily