Saturday, November 23, 2024

ద్రవ్యోల్బణం డిసెంబర్‌ వరకు అధికంగా ఉండే అవకాశం : ఆర్బీఐ..

ముంబాయి : ద్రవ్యోల్బణం నిర్ధేశించిన దానికంటే డిసెంబర్‌ వరకు అధికంగానే ఉండే అవకాశం ఉందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్బీఐ సరైన చర్యలే తీసుకుంటుందని ఆయన చెప్పారు. వినియోగదారుల ధర సూచీ మరింత పెరిగుతుందని, తగిన చర్యలు తీసుకుంటున్నందున ఇది 6 శాతం లోపుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. వరసగా ఐదు నెలలుగా ద్రవ్యోల్బణం పెరుగుతునే ఉంది. మే నెలలో ఇది 8 సంవత్సరాల గరిష్టానికి చేరి 7.79 శాతంగా నమోదైంది. ఇది ఆర్బీఐ నిర్దేశించిన దానికంటే అధికంగా ఉందన్నారు. సరఫరాలో ఏర్పడిన సమస్యల మూలంగా ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుతోందని, ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం కొంత కనిపిస్తుందన్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం కేవలం కుటుంబాలపైనే కాదని, ఆహార పదార్ధాల రేట్లు, వినియోగ వస్తువులు, సేవలు వంటి రంగాల్లోనూ ధరల పెరుగుదల ప్రభావం ఉంటుందన్నారు.

ద్రవ్యోల్బణం పెరిగితే కంపెనీల పెట్టుబడుల ప్రణాళికలపై కూడా ప్రభావం పడుతుందన్నారు. కోవిడ్‌ తరువాత మన దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని, స్థిరంగా వృద్ధి చెందుతుందని చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలు కొంత మేర రూపాయి బలహీనపడడాని కి కారణమన్నారు. అయితే మన విదేశీ మారక నిల్వలు తగినంతగా ఉన్నాయని, దేశ స్వల్పకాలిక రుణం భారం కంటే ఇవి అధికంగానే ఉన్నాయన్నారు. దీంతో పాటు మన దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా దేశాల కంటే బలంగా ఉన్నాయని శక్తికాంత దాస్‌ చెప్పారు ఆర్బీఐ ఇప్పటికే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రెండు సార్లు వడ్డీ రేట్లు పెంచింది. త్వరలోనే మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని కూడా ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement