Saturday, November 23, 2024

కార్డిసెప్స్‌ ఫంగస్‌ కోసమే.. చైనా సైనికుల చొరబాటు!

భారత భూభాగంలోకి చైనీయుల చొరబాట్ల కు ఖరీదైన ఔషధ మూలికలే కారణమని ఇండో పసిఫిక్‌ సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్స్‌ (ఐపీసీఎస్‌సీ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కార్డిసెప్స్‌ అనే ఔషధ మూలికల కోసమే చైనా సైనికులు అరుణాచల్‌లో అక్రమంగా ప్రవేశించారని తాజా నివేదిక పేర్కొంది. ఫంగస్‌ మూలికను గొంగళిపురు గు ఫంగస్‌ లేదా హిమాలయన్‌ గోల్డ్‌ లేదా సూపర్‌ మష్య్రూమ్స్‌ అని కూడా పిలుస్తారు. చైనాలో దీనికి బంగారం కంటే ఎక్కువ ధర లభిస్తుంది. 10గ్రాముల ధర సుమారు 700 డాలర్లు (రూ.56వేలు) ఉంది. ఇందులో నాణ్యమైన రకమైతే లక్షల్లో ధర పలుకుతుం దని నిపుణులు చెబుతున్నారు. కార్డిసెప్స్‌ విలువ 2022లో ప్రపంచ వ్యాప్తంగా 1072.50 మిలియన్లుగా ఉంది. వీటిని అన్వేషించే క్రమంలోనే పీఎల్‌ఏ బలగా లు తవాంగ్‌ సెక్టార్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.

తగ్గుతున్న దిగుబడి.. పెరుగుతున్న డిమాండ్‌

ఈ కార్డిసెప్స్‌ ప్రధానంగా భారతీయ హిమాలయాల్లోను, నైరుతి చైనాలోని క్వింగై-టిబెటన్‌ పీఠభూమి ఎత్తయిన ప్రదేశాలలో దొరుకుతాయి. ఈ మూలికకు చైనా అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. క్వింగ్‌హై ప్రాంతంలో కార్డిసెప్స్‌ పంట సాగవుతుంది. గత రెండేళ్లలో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. దాంతో ఫంగస్‌ కొరత పెరిగింది. అదే సమయంలో అత్యంత విలువైన కార్డిసెప్స్‌కు డిమాండ్‌ గత దశాబ్దకాలంలో బాగా పెరిగింది. కార్డిసెప్స్‌ ఔషధ మూలికలను కిడ్నీ రుగ్మతల నుంచి నంపుసకత్వం వరకు అనేక వ్యాధుల నివారణకు ఉపయోగిస్తున్నారు. ఐపిసిఎస్‌సి ప్రకారం, 2018లో ఉత్పత్తి 43,500 కిలోల నుంచి 41,200 కిలోలకు తగ్గింది. 2010-11 సంవత్సరాల్లో ఇది 1.5 లక్షల కిలోలుగా ఉండేది. ఇటీవలి సంవత్సరాల్లో కింగ్‌హైలోని చైనీస్‌ కార్డిసెప్స్‌ కంపెనీలు, పర్వతాల్లోని ఔషధ మూలికల సేకరణకు స్థానికులకు లక్షల యువాన్‌లను చెల్లిస్తున్నాయి. హిమాలయాల్లోని కొన్ని పట్టణాలు జీవనోపాధి కోసం ఈ ఫంగస్‌ను సేక రించి విక్రయిస్తుంటాయి. టిబెటన్‌ పీఠ భూమి, హిమాలయాలలోని గృహ ఆదాయంలో 80శాతం ఈ ఫంగస్‌ నుంచే వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

- Advertisement -

వ్యూహాత్మక ఆందోళనలు..

ఫంగస్‌ను సేకరించేందుకు పీఎల్‌ ఏ బలగాలు హద్దులు దాటటం అనేది కొత్తేమీకాదు. ఇవి వ్యూహాత్మక అందోళ నలను కలిగి ఉండకపోవచ్చు. కానీ, ఏదేమైనా అతిక్రమణలను తీవ్రంగా పరిగణించాలి. ఈశాన్యంలోని భారతదేశం-చైనా సరిహద్దు ప్రాంతం వివిధ రకాల మొక్కలు, విలువైన పంటలకు సారవంతమైనది. స్థానికులు కూడా ఇలాంటి వాటిని అన్వేషిస్తూ, పొరబాటుగా దారితప్పి ప్రత్యర్థి సైనికుల నిర్బంధంలోకి వెళ్తుంటారు. అనేక మంది స్థానికులు కూడా భారతీయ సైన్యం ద్వారా పోర్టర్లను కలిగివున్నారు. కొన్నిసార్లు మూలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించే ఇతర వస్తువులను సేకరించేందుకు స్థానికులు రోజుల తరబడి అన్వేషణలు సాగిస్తుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement