Saturday, November 23, 2024

అసంక్రమిత వ్యాధుల, రోగుల సేవలో నిర్లక్ష్యం వద్దు

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రత్యేకంగా జిల్లాలో అసంక్రమిత వ్యాధుల రోగుల సేవలకు ప్రత్యేకంగా రోగుల గుర్తింపు ,వారికి చికిత్సలు అందించడం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఏం.వెంకట్ దాస్ తెలిపారు.
శనివారం మండలంలోని లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని , మంగనూర్ ఆరోగ్య ఉపకేంద్రము ను ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ సుచరిత ని సేవల నిర్వహిస్తున్న పనితీరును అడిగి వివరాలు తెలుసుకున్నారు. లట్టుపల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు గ్లూకోజ్ మరియు సెలైన్ ఎక్కిస్తున్న రోగుల ద్వారా సేవల వివరాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

మంగనూర్ ఆరోగ్య ఉప కేంద్రం లో నవజాత శిశువులకు, చిన్నారులకు రొటీన్ సార్వత్రిక టీకాల పంపిణీ మరియు కరోణ వ్యాధి నిరోధక టీకాల పంపిణీ తీరును, విడివిడిగా వ్యాక్సిన్ నిల్వ చేసుకున్న తీరును ప్రత్యేకంగా పరిశీలించి 100% నాణ్యతతో కూడిన వ్యాక్సిన్ ని ఉపయోగించి, ఆరోగ్య సేవలు ప్రజలకు మెరుగ్గా అందించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు.

అసంక్రమిత వ్యాధుల రోగులను గుర్తించి, ఆరోగ్య చికిత్సలు అందిస్తూ, అంతర్జాలంలో ప్రతి ఒక్కరి పేరు నమోదు చేయాలని ఆయన ప్రత్యేకంగా సూచించారు. మధుమేహం, అధిక ఒత్తిడి, క్యాన్సర్, గుండెజబ్బులు, పక్షవాతం రోగులను ప్రతి గ్రామంలో, గిరిజన తండాలలో తప్పనిసరిగా గుర్తించాలని ఆయన సూచించారు.
కరోనా నిరోధక టీకాలను అర్హులైన ప్రతిఒక్కరికీ తప్పనిసరిగా అందించాలని 100% పూర్తి చేయాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఏం. అశోక్ కుమార్,సుచరిత, హెల్త్ ఎడ్యుకేటర్ నరసింహ ఆరోగ్య పర్యవేక్షకులు పోల శ్రీధర్, కే. కిష్టమ్మ, ఆరోగ్య కార్యకర్తలు టి.యాదగిరి, పి.పద్మ,పి.జ్యోతి, సుమిత్ర, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement