Tuesday, November 26, 2024

మొదటి పుట్టినరోజు జరుపుకోకుండానే ఆగ‌మైతున్న‌రు.. ప్రతి 36మంది శిశువుల్లో ఒకరు మృతి

శిశుమరణాల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా గట్టి కృషి చేస్తున్నప్పటికీ, వాటిని పూర్తిగా నియంత్రించ లేక పోతోంది. ఇప్పుడు కూడా ప్రతి వెయ్యిమందిలో 36 మంది శిశువులు ఏడాది నిండకుండానే మరణిస్తుంటే, మొదటి పుట్టినరోజు కూడా చేసుకోకుండా ప్రతి 36 మందిలో ఒక శిశువు మరణిస్తున్నారని 2020 ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. ఒక దేశం లేదా ప్రాంతం యొక్క ఆరోగ్య పరిస్థితి ఆ దేశ శిశుమరణాల రేటు (ఐఎంఆర్‌)ఆధారంగా లెక్కించడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల విడుదల చేసిన కొత్త డేటా ప్రకారం ప్రతి వెయ్యి మందిలోనూ, 28 మంది శిశువులు మరణిస్తున్నారు. అదే 1971 నివేదికను పరిశీలిస్తే, వెయ్యి మంది శిశువులకు గాను 129 మంది మరణించారు. ఇండియాలో గత పదేళ్లుగా, ఐఎంఆర్‌ రేటు 36శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా 44 నుంచి 28 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో 48 నుంచి 31కు, పట్టణ ప్రాంతాల్లో 29 నుంచి 19కు35 ను 34 శాతానికి తగ్గినట్లు నివేదిక ప్రకటించింది.

జాతీయస్థాయిలో ప్రతి 36 మంది శిశువుల్లో ఒక శిశువు మొదటి పుట్టిన రోజు కూడా జరుపుకోకుండా మరణించడం జరుగుతోందని ఆ నివేదిక స్పష్టం చేసింది. 2020లో అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 45 మంది శిశులు మరణిస్తే, మూడు మరణాలతో మిజోరం అతి తక్కువ శిశుమరణాలు నమోదైన రాష్ట్రంగా మారింది. జాతీయస్థాయిలో శిశు జననాల సంఖ్య సైతం తగ్గినట్లు నివేదిక స్పష్టం చేసింది.గత ఐదు దశాబ్దాల్లో, శిశు జననాల సంఖ్యను పరిశీలిస్తే, 1971లో శిశుజననాలు 36.9 శాతం ఉండగా, 2020లో ఆ రేటు 19.5 శాతానికి చేరింది. శిశు జననాల సంఖ్య తగ్గడంలో గ్రామీణ, పట్టణాలు అనే తేడాలు ఏమీ లేవని నివేదిక స్పష్టం చేసింది. 2011 నుంచి 2020 వరకు సుమారు 11 శాతం జననాల సంఖ్య తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. 2011వ దశకంలో శిశు జననాల శాతం 21.8 ఉండగా, 2020లో అది 19.5కి చేరింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో 23.3 నుంచి 21.1 శాతం, పట్టణ ప్రాంతాల్లో 17.6 నుంచి 16.1 శాతానికి తగ్గింది. శిశు జననాల సంఖ్య పెరిగితే, జనాబా పెరుగుదల పెరుగుతుదని ఈ అద్యయనం వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement