సౌతాఫ్రికా సెంచూరియన్ వేదికగా జరుతుతన్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఆలౌట్ అయింది. 408 పరుగులకే సఫారీ జట్టు 9 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ తెంబ బవుమా బ్యాటింగ్‌కు రాలేదు. దాంతో, టీ సెషన్‌కు ముందే ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ఆల్‌రౌండర్ మార్కో జాన్‌సేన్ 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ప్రస్తుతం ప్రొటిస్ జట్టు 163 పరుగుల ఆధిక్యంలో ఉంది.
లంచ్ బ్రేక్ తరువాత యార్కర్ కింగ్ బుమ్రా చెలరేగి నాలుగు వికెట్లు దక్కించుకున్నాడు. ఓపెనర్ డీన్ ఎల్గర్ 185 పరుగులతో డబుల్ సెంచరీదిశగా దూసుకెళ్తున్న అతడినిను శార్దూల్ ఠాకూర్ ఔట్ చేయడంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. మార్కో జాన్‌సేన్(72)తో కలిసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఆ వెంటనే గెరాల్డ్ కోఎట్జీ (18)ని అశ్విన్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన రబాడ(1), బర్గర్(0)లను బుమ్రా బౌల్డ్ చేసి సఫారీ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.