సూపర్‌స్పోర్ట్ పార్క్ సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ విజయాన్ని సాధించింది. పేసర్లు రబడ, బర్గర్ చెలరేగడంతో ఇన్నింగ్స్ 32 పరుగులతో టీమిండియాపై గెలుపొందింది.163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ సేన 133 పరుగులకే కుప్పకూలింది.
విరాట్ కోహ్లీ (76) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టాడు. మరోవైపు వచ్చిన వాళ్లు వచ్చినట్టు పెవిలియన్‌కు క్యూ చేరడంతో.. ఇన్నింగ్స్ ఓటమి తప్పలేదు. జాన్సెన్ ఓవర్లో భారీ షాట్ ఆడిన కోహ్లి.. బౌండరీ వద్ద రబాడ చేతికి చిక్కాడు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో ప్రొటిస్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ ఓటమితో సఫారీ వేదికగా టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్న భారత జట్టు.. ఇక సిరీస్‌ను డ్రా చేసుకోవడంపైనే దృష్టి పెట్టింది.