సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ (70 నాటౌట్), సిరాజ్ ఉన్నారు. కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేశాడు.
ఇక సఫారీ పేసర్ కగిసొ రబాడా ఐదు వికెట్లతో విజృంభించాడు. రోహిత్, విరాట్, శ్రేయస్ వంటి స్టార్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. సౌతాఫ్రికా పేసర్ రబాడా ఐదు వికెట్లు తీయడంతో పాటు మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికా తరఫున ఐదు వందల వికెట్లను పూర్తిచేసుకున్నాడు. సౌతాఫ్రికా తరఫున ఈ ఘనత సాధించిన బౌలర్లలో రబాడా ఏడో స్థానంలో ఉన్నాడు. షాన్ పొలాక్ (823), డేల్ స్టెయిన్ (697), ముఖయా ఎన్తిని (661), అలెన్ డొనాల్డ్ (602), జాక్వస్ కలిస్ (572), మోర్నీ మోర్కెల్ (535) తర్వాత రబాడ ఉన్నాడు.