Wednesday, November 20, 2024

త‌ర‌గ‌తి గ‌దుల్లో -టీచ‌ర్ల‌కు సాయంగా రోబోలు

కొత్త ప్ర‌యోగం చేసింది ఇండ‌స్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ యాజ‌మాన్యం.త‌ర‌గ‌తి గ‌దుల్లో టీచ‌ర్ల‌కు సాయంగా రోబోలని ఏర్పాటు చేశారు. అంతేకాదు అవ‌స‌ర‌మ‌యితే విద్యార్థుల‌కు పాఠాలు కూడా చెప్ప‌గ‌ల‌వ‌ట ఈ రోబోలు. విద్యార్థులు అడిగే సందేహాలను రోబో తీరుస్తుంది. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/ఏఐ) సాయంతో ఈ రోబోలు టీచర్ పాత్రను నిర్వహిస్తున్నాయి. పాఠశాలలో రోబో టీచర్ ప్రవేశపెట్టడం అన్నది దేశంలోనే తొలిసారిగా ఈ స్కూల్ యాజమాన్యం పేర్కొంది. ఈగల్ రోబోల గురించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సైతం వివరించడం గమనార్హం. హైదరాబాద్, బెంగళూరు, పుణెలో ఉన్న మూడు విద్యా కేంద్రాల్లోనూ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ రోబోలను రంగంలోకి దింపింది. ఐదు నుంచి 11వ తరగతులకు ఈ రోబోలు పాఠాలు కూడా చెబుతాయి. 30కు పైగా భాషల్లో పాఠాలు బోధించగలవు. విద్యార్థుల సందేహాలు తీర్చగలవు. రోబో చెప్పే పాఠాలను విద్యార్థులు మొబైల్స్, ల్యాప్ టాప్ ల నుంచి యాక్సెస్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement