విజయవాడ, ఆంధ్రప్రభ : నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మకు భక్తులు పెద్ద ఎత్తున కానుకలను సమర్పించుకున్నారు. భక్తులు అమ్మవారికి నగదు తో పాటు బంగారం, వెండి, విదేశీ కరెన్సీలను కానుకలుగా సమర్పించారు.
దేవస్థానములోని మహా మండపం ఆరవ అంతస్తులో మంగళవారం ఈవో రామచంద్ర మోహన్ ఆధ్వర్యంలో ఆలయములోని హుండీలను లెక్కించారు.
ఈ క్రమంలో భక్తులు అమ్మవారికి నగదు రూ. 3,22,45,920/- లు,కానుకల రూపములో, బంగారం 618 గ్రాములు, వెండి 6 కేజీల 28 గ్రాములు సమర్పించుకున్నారు. అలాగే విదేశీ కరెన్సీ కి సంబంధించి యు.ఎస్.ఎ 773 డాలర్లు,ఆస్ట్రెలియా 125 డాలర్లు, సౌదీ 30 రియాల్స్, యూరప్ 5 యూరోలు, యూఏఈ 35 దిర్హమ్స్, కేనేడా 205 డాలర్లు, సింగపూర్ 14 డాలర్లు, మలేషియా 93 రింగేట్లు, థాయిలాండ్ 120 భాట్, ఇంగ్లాండ్ 15 పౌండ్లు, స్కోట్లాండ్ 10 పౌండ్లు, న్యూజిలాండ్ 10 డాలర్లు, హంకాంగ్ 10 డాలర్లు, ఖతర్ 50 రియబ్ లు, ఒమన్ 400 బైసా, కువైట్ 0.5 దినార్ లను భక్తులు అమ్మవారికి సమర్పించుకున్నారు.
ఈ హుండీ ద్వారా 21 రోజులకు అమ్మవారికి భక్తులు ఆన్లైన్ ద్వారా రూ 1,13,085 రూపాయలను బహుకరించారు.
ఈ హుండీ లెక్కింపు లో ఆలయ ఈవో కె రామచంద్ర మోహన్, డీప్యూటీ ఈవో ఎమ్.రత్న రాజు, దేవాదాయ శాఖ అధికారులు, ఏఈఓ లు, ఆలయ సిబ్బంది, ఎస్పీఎఫ్ I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు పాల్గొన్నారు.