(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనకదుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవుల నేపథ్యంలో కనకదుర్గమ్మ దర్శనానికి వేలాదిగా తరలిరావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనానికి భక్తులు తరలిరావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులోనే ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. ఆదివారం ఒక్కరోజే వివిధ రూపాల్లో అమ్మవారి ఆలయానికి రూ.55 లక్షల ఆదాయం సమకూరింది.
గత మూడు రోజులుగా అమ్మవారిని, స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం వరకు వివిధ టిక్కెట్ల ద్వారా రూ.54,09,483 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇక, శనివారం రూ.33,39,481, శుక్రవారం రూ.39,74,194 మొత్తం రూ.39,74,194 అమ్మవారికి ఆదాయం సమకూరునట్లు ఆలయ ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.