Wednesday, November 20, 2024

రూ. 14 ల‌క్ష‌లు ప‌లికిన అరుదైన మొక్క‌

మొక్కలంటే కొందరికి ప్రాణం. మొక్కలను కొని వాటిని పెంచడం వారికి హాబీ లాంటిది. కానీ ఓ ఇండోర్ మొక్క ఎవ‌రూ ఊహించ‌ని ధ‌ర‌కు వేలంలో అమ్ముడుపోవ‌డం హాట్ టాపిక్‌గా మారింది. న్యూజిలాండ్ ఆక్ష‌న్ వెబ్ సైట్ ‘ట్రేడ్ మీ’ వేదిక‌గా కేవ‌లం 8 ఆకులు క‌లిగిన ఈ అరుదైన మొక్క‌ను అక్లాండ్ కు చెందిన వ్య‌క్తి ఏకంగా రూ 14 ల‌క్ష‌ల‌కు సొంతం చేసుకున్నాడు. తెలుపు రంగులో ఉండే రాపిడోఫోరా టెట్రాస్పెర్మా అనే ఈ మొక్క ప్ర‌తి ఆకులో కాండం వ‌లే అద్భుత‌మైన వైవిధ్య‌త ఉంద‌ని ట్రేడ్ మీ తెలిపింది.

రాయ‌ల్ గార్డెన్స్ కు చెందిన ఆన్‌లైన్ ప్లాంట్ రిజిస్టర్ క్యూలో న‌మోదైన వివ‌రాల ప్ర‌కారం.. ఈ మొక్క థాయ్‌లాండ్ ,మలేషియాల‌కు చెందినదని వెల్ల‌డైంది. ఇండ్ల‌లో పెంచుకునే మొక్క‌ల్లో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన అరుదైన మొక్క ఇదేన‌ని ఈ మొక్క ఫోటోను ట్రేడ్ మి ట్వీట్ చేసింది. ఈ మొక్క వేలం ప్ర‌క్రియ సాగుతుండ‌గా అరుదైన మొక్క‌కు ల‌క్ష‌కు పైగా వ్యూస్ రావ‌డం మొక్క‌ల ప‌ట్ల న్యూజిలాండ్ వాసుల‌కు ఎంత‌టి ప్రేమ ఉంద‌నేది వెల్ల‌డ‌వుతోందని ట్రేడ్ మి ప్ర‌తినిధి మిల్లీ సిల్వెస్ట‌ర్ పేర్కొన్నాడు. గ‌త ఏడాదిలోనూ న్యూజిలాండ్ లో కేవ‌లం ఆరు ఆకులు క‌లిగిన ఇండోర్ ప్లాంట్ ఏకంగా వేలంలో రూ 3,91,000 పలికింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement