2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ నుంచి ఇండోర్ గేమ్స్ కూడా అనుమతివ్వాలని వరల్డ్ ఆర్చరీ (డబ్ల్యూఏ) శుక్రవారంనాడిక్కడ ప్రకటించింది. దీంతో భారత్ ‘గేమ్ చేంజర్” కానుంది. ప్రస్తుతం ఒలింపిక్స్‌లో రికర్వ్ ఈవెంట్లు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఏసియన్ గేమ్స్, యూరోపియన్ గేమ్స్, పాన్ అమెరికన్ గేమ్స్, వరల్డ్ గేమ్స్, వరల్డ్ యూనివర్శిటీ గేమ్స్ల్లో ఇప్పటికే ఇండోర్ గేమ్స్‌కు అవకాశమిచ్చారు. అయితే ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో ఇండోర్ గేమ్స్‌కు అనుమతి లేదు.
”వరల్డ్ ఆర్చరీ ప్రతిపాదన మేరకు 9 రోజుల ఒలింపిక్ షెడ్యూల్లో చివరి మూడు రోజులు ఇండోర్ ఆర్చరీ కాంపిటీషన్, ఇందులో మెన్, ఉమెన్, డబుల్స్ టీమ్‌లకు అవకాశం ఉంటుంది” అని వరల్డ్ ఆర్చరీలో ఒక ప్రకటనలో వెల్లడించింది. వరల్డ్ ఆర్చరీ నిర్ణయాన్ని ఇండియన్ ఆర్చరీ హై పర్ఫార్మన్స్ డైరెక్టర్ సంజీవ సింగ్ స్వాగతించారు. భారత్‌కు ఇదొక గేమ్ చేంజర్ కానుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.