తెలంగాణ రైతులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. నేలకొండపల్లి మండల పర్యటనలో భాగంగా కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, లబ్ధిదారులందరికీ న్యాయం చేస్తామని అన్నారు.
అదేవిధంగా, సంక్రాంతి పండుగకు రైతుభరోసా ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం డిసెంబర్ 5న యాప్‌ను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో చేపట్టబోతుందని చెప్పారు. ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తాం అన్నారు.