వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ భూనిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వరంగల్ లోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా 863 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు 863 మందికి స్టేట్ రిజర్వ్ కోటా కింద ఇందిరమ్మ ఇళ్లు కట్టించేందుకు తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఆర్ అండ్ బీ సెక్రటరీ జ్యోతి బుద్ధా ప్రకాష్ ఆర్డర్స్ జారీ చేశారు. దీంతో తొందర్లోనే కాకతీయ మెగా టెక్స్ టైల్స్ పార్క్ పక్కనే భూ నిర్వాసితుల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పడనుంది.