Wednesday, November 20, 2024

భారీ విస్తరణ దిశగా ఇండిగో.. 115 ప్రాంతాలకు సర్వీస్‌లు నడపాలని ప్లాన్‌

విమానయాన చరిత్రలోనే ఎయిర్‌ ఇండియా అతి పెద్ద కొనుగోలు ఆర్డర్‌ పెట్టింది. ఇప్పుడు ఇండిగో కూడా అదే బాటలో భారీ స్థాయిలో విమానాలను సమీకరించనుంది. ఇప్పటికే తాము 500 విమానాలకు సమీకరించాలని నిర్ణయించామని ఇండిగో సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ సర్వీస్‌లను భారీ స్థాయిలో విస్తరించాలని ఇండిగో ని ర్ణయించింది.
ఇండిగో ప్రస్తుతం రోజువారి 1800 సర్వీస్‌లను, 102 గమ్యస్థానాలకు వీటిని నడుపుతోంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ నాటికి 115 గమ్యస్థానాలకు నెట్‌వర్క్‌ను విస్తరించనున్నామని ఆయన తెలిపారు.

- Advertisement -

వీటిలో ఎక్కువ అంతర్జాతీయ సర్వీస్‌లు ఉంటాయన్నారు. 2024 నాటికి విమాన ప్రయాణీకుల సంఖ్య 10 కోట్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. ఇండిగో 2019లో 300 విమానాల కోసం ఆర్డర్‌ ఇచ్చింది. గత సంవత్సరం నవంబర్‌ నుంచి వీటి డెలివరీ ప్రారంభమైంది. మరో 500 నారో బాడీ విమానాలు రావాల్సి ఉందన్నారు. ఇండిగో నెట్‌వర్క్‌ను భారీగా విస్తరిస్తామని పీటర్‌ ఎల్బర్స్‌ చెప్పారు. ప్రస్తుతం ఇండిగో 76 దేశీయ, 26 అంతర్జాతీయ గమ్యస్థానాలకు సర్వీస్‌లను నడుపుతున్నది. వీటిని వచ్చే సంవత్సరానికి 115కి పెంచనుంది.

ప్రస్తుతం దేశీయ విమానయాన రంగంలో ఇండిగో మార్కెట్‌ లీడర్‌గా ఉంది. ఈ సంస్థకు దేశీయ మార్కెట్‌లో 56.1 శాతం వాటా కలిగి ఉంది. మొత్తం టాటా గ్రూప్‌ ఎయిర్‌లైన్స్‌ కలిపి 24.1 శాతం వాటా కలిగి ఉన్నాయి. మిగిలిన అన్ని సంస్థలకు కలిపి 19.8 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉన్నాయి. ఎయిర్‌ ఇండియా ఆర్డర్‌ అత్యంత పెద్దదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండిగో 2019లో 300 విమానాలకు ఆర్డర్‌ ఇచ్చిందని చెప్పారు. ప్రపంచంలో టాప్‌ 5 సంస్థలు ఇచ్చే ఆర్డర్లలో రెండు ఇండియాకు చెందినవే ఉన్నాయన్నారు. తుర్కిస్‌ ఎయిర్‌లైన్స్‌ నుంచి రెండు పెద్ద విమానాలను లీజ్‌కు తీసుకున్నట్లు చెప్పారు. ఇస్తాంబుల్‌, యూరోప్‌కు మరిన్ని సర్వీస్‌లు నడనున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ సర్వీస్‌లను పెంచుతామని, ఈ సంవత్సరం జకర్తా, నౌరోబీకి సర్వీస్‌లు నడుపుతామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement