ఇండిగోకు చెందిన కమర్షియల్ ఎయిర్‌లైన్ పైలట్ గురువారం నాగ్‌పూర్‌లోని బోర్డింగ్ గేట్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. నాగ్‌పూర్-పుణె విమానాన్ని నడపడానికి ఈ పైలట్ రెడీ అవుతుండగా ఉన్నట్టుండి పడిపోయాడు. దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అప్పటికే అతను చనిపోయినట్లు ప్రకటించారు.
కాగా, వారం రోజుల వ్యవధిలో పైలట్ మృతి చెందడం ఇది మూడోసారి. ఇక ఇప్పటికే చనిపోయిన వారిలో ఇద్దరు భారతీయ పైలట్లు ఉండగా.. మరొకరు ఖతార్ ఎయిర్వేస్కు చెందిన పైలట్‌గా తెలుస్తోంది. ఇక.. ఢిల్లీ నుంచి దోహాకు ప్రయాణిస్తున్న ఖతార్ ఎయిర్వేస్ పైలట్ నిన్న (బుధవారం) అస్వస్థతకు గురై చనిపోయాడు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా విమానాన్ని దుబాయ్‌కి మళ్లించారు.