సామూహిక సెలవులు పెడతారని ఆందోళన చెందిన ఇండిగో యాజమాన్యం తమ పైలట్లు, విమానంలో పనిచేసే సిబ్బంది (క్రూ)కి భారీగా జీతాలు పెంచింది. దీంతో గడచిన నాలుగు నెలల్లో వీరి జీతాలు 16 శాతం మేర పెరిగినట్టయింది. ఒకవేళ పైలట్లు, క్రూ సామూహిక సెలవులు పెడితే విమానాల రాకపోకలపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందిన యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. గత శనివారం వీరంతా సామూహిక సెలవులు పెట్టడంతో 900 విమానాల రాకపోకలు ఆలస్యమైనాయి. జులై 2న పెద్దఎత్తున ఇండిగో పైలట్లు, క్రూ సిబ్బంది అనారోగ్య కారణాలతో సెలవులు పెట్టారని, ఫలితంగా పెద్దఎత్తున ఆ విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడిందని, 55 శాతం ఇండిగో విమానాల రాకపోకల్లో జాప్యం ఏర్పడిందని భారత విమానయాన శాఖ గణాంకాలు పేర్కొన్నాయి.
1600 లోకాస్ట్ కేరియర్ల రాకపోకల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. గత ఏప్రిల్‌లో ఇలాగే సిబ్బంది సామూహిక సెలవులు పెట్టారు. అదే రోజు ఎయిర్ ఇండియా నియామకాలు చేపట్టడం గమనార్హం. కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో విమానాల రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో సిబ్బంది జీతాల్లో 8 శాతం కోత విధించారు. కాగా గత ఏప్రిల్‌లో 8 శాతం మేర జీతాలు పెంచిన యాజమాన్యం ఇప్పుడు మరోసారి అదే స్థాయిలో జీతాలు పెంచినట్లు ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.