డబ్లిన్ వేదికగా ఐర్లాండ్ తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇవ్వాల (ఆదివారం) రెండో మ్యాచ్ జరుగుతోంది. కాగా, తొలి టీ20లో డీఎల్ఎస్ ప్రకారం గెలిచిన భారత్ ఈ మ్యాచ్ కూడా సోంతం చేసుకోవాలని చూస్తోంది.
కాగా, ఇవ్వాల జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ లో నిలవాలని చూస్తోంది ఐర్లాండ్ జట్టు.. కాగా, ఈ మ్యాచ్ గెలవాలంటే.. 186 పరుగులు చేయాల్సి ఉంది.
భారత జట్టు తరుపున రుతురాజ్ గైక్వాడ్ 58 (6 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. సంజు సాంసన్ కూడా 26 బంతుల్లో 40 (5 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక రింకూ సింగ్ 21 బంతుల్లో 38 (2 ఫోర్లు, 3 సిక్స్) పరుగులు చేసి లాస్ట్ ఓవర్ లో అవుట్ అయ్యాడు. శివమ్ దూబే 16 బంతుల్లో 22 పరుగులు (2 సిక్స్ లు ) చేసి నాటౌట్ గా ఉన్నాడు.
తుది జట్లు :
ఐర్లాండ్
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండీ, టక్కర్, టెక్టార్, కర్టీస్ క్యాంఫర్, జార్జ్ డాక్ రెల్, మార్క్ ఎయిడర్, మెక్ క్యాథీ, క్రెయిగ్ యంగ్, జాష్ లిటిల్, బెన్ వైట్,
టీమిండియా
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సంజూ సామ్సన్, శివమ్ దూబె, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, బుమ్రా, ప్రసిధ్, అర్ష్ దీప్ సింగ్