Thursday, January 16, 2025

Kho Kho WC 2025 | ఖో ఖో ప్రపంచకప్‌లో భారత్ జోరు..

  • క్వార్టర్స్‌లోకి భారత మహిళల, పురుషుల జట్లు

తొలి ఖో ఖో ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు తమ ఆధిపత్యాన్ని, విజయాల పరంపరను కొనసాగించింది. ఈరోజు ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన ప్రిక్వార్టర్స్‌(ఆఖ‌రి గ్రూప్ స్టేజ్ మ్యాచ్)లో మలేషియా జట్టును చిత్తుగా ఓడించిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.

ఈ మ్యాచ్‌లో మొదటి నుంచే ఆధిపత్యం చెలాయించిన భారత్ 100-20 భారీ తేడాతో మలేషియాను ఓడించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. ఇక క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

మరోవైపు పురుషుల జట్టు కూడా అజేయంగా క్వార్టర్స్‌కు చేరుకుంది. భూటాన్‌తో జరిగిన ప్రీ క్వార్టర్స్ పోరులో భారత పురుషుల జట్టు 71-34తో విజయం సాధించింది. ఈ విజయంతో, 2025 ఖో ఖో ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement