Saturday, November 23, 2024

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​లో భారత్​ జోరు.. పాకిస్థాన్​ని కిందికి తోసి పైపైకి!

ఆసియాకప్ 2023 టోర్నీలో టీమిండియా అజేయంగా దూసుకుపోతోంది. సూపర్‌-4లో వరుసగా రెండు విజయాలతో ఇప్ప‌టికే ఫైనల్స్‌కు చేరింది. ఇక‌, తుదిపోరుకు ముందు నేడు (సెప్టెంబర్ 15) బంగ్లాదేశ్‍తో తలపడతోంది. అయితే.. కీలకమైన సూపర్-4 మ్యాచ్‍లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్​ ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ తరుణంలో తాజాగా వచ్చిన ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్​లో పాక్ ర్యాంకు దిగజారింది. పాకిస్థాన్‍ను వెనక్కి నెట్టి టీమిండియా పైకి ఎగబాకింది.

శ్రీలంక చేతిలో ఓటమి తర్వాత ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్‍ల్లో పాకిస్థాన్ 115 రేటింగ్ పాయింట్ల (3,102 పాయింట్ల)తో మూడో ర్యాంకుకు పడిపోయింది. మరోవైపు ఆసియా కప్‍లో ఫుల్ జోష్​ మీద ఉన్న టీమిండియా 116 రేటింగ్ పాయింట్లతో వన్డేల్లో రెండో ర్యాంకుకు ఎగబాకింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‍లో దుమ్మురేపుతున్న ఆస్ట్రేలియా 118 పాయింట్లతో ఇటీవలే టాప్ ర్యాంకుకు చేరింది.

- Advertisement -

ఆసియాకప్ 2023 టోర్నీలో వన్డే నంబర్ వన్ ర్యాంకర్‌గా అడుగుపెట్టిన పాకిస్థాన్.. ఇప్పుడు టోర్నీ నుంచి నిష్క్రమించడమే కాకుండా ర్యాంకింగ్‍ల్లో మూడో స్థానానికి పడిపోయింది. ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్‍ల్లో పాకిస్థాన్ తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ (103), న్యూజిలాండ్ (102), దక్షిణాఫ్రికా (101), శ్రీలంక (93) ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement