కామన్వెల్త్ గేమ్స్-2022 టోర్నీలో బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ఈ రోజు (గురువారం) జరిగిన మ్యాచ్‌ల్లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్‌లు స్వర్ణ పతకం లక్ష్యంగా దూసుకుపోతున్నారు. మహిళల సింగల్స్‌లో సింధు.. మాల్దీవులుకు చెందిన ఫాతిమాహ్ నబామా అబ్దుల్ రజాక్‌ను 21.-4, 21-11 తేడాతో ఓడించారు., పురుషుల సింగల్స్‌లో శ్రీకాంత్ ఉగాండకు చెందిన డానియల్ వానగలియాను 21-9, 21-9 తేడాతో ఓడించి ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంటరయ్యారు. వీరిద్దరు తమ తొలి రౌండ్లలో ప్రత్యర్ధులపై సునాయస విజయాలు సాధించి ముందడుగు వేశారు.
ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన సింధూ.. తన మాల్దీవులు ప్రత్యర్థి ఫాతిమాహ్‌పై సునాయాస విజయం సాధించారు. సెకండ్ సెట్‌లో ఫాతిమా నుంచి కొంత ప్రతిఘటన ఏర్పడింది. ఒకానొక దశలో స్కోర్ 9-9గా కొనసాగింది. తర్వాత పుంజుకున్న పీవీ సింధు.. 21-11 స్కోర్ తేడాతో ఫాతిమాను మట్టి కరిపించారు.
శ్రీకాంత్.. ఉగాండాకు చెందిన డేనియల్ వానగాలియాపై 21-9, 21-9 తేడాతో సునాయాస విజయాన్ని సాధించాడు. గత కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలు గెలిచిన సింధు, శ్రీకాంత్‌లు.. ఈ సారి ఎలాగైనా స్వర్ణం నెగ్గాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.