Friday, November 22, 2024

భారత్‌ వృద్ధి రేటు 8.2 శాతం, 80 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) భారత్‌ వృద్ధి రేటుపై కీలక గణాంకాలు విడుదల చేసింది. దీనికి రెండు కారణాలు చూపింది. ప్రతీ నెల పెరుగుతున్న టోకు, రిటైల్‌ ద్రవ్యోల్బణంతో పాటు ఉక్రెయిన్‌-రష్యా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు అని వివరించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం చాలా కాలం పాటు కొనసాగే అవకాశం ఉందన్న నేపథ్యంలో భారత్‌ వృద్ధి రేటును 80 బేసిస్‌ పాయింట్లు తగ్గించి.. 8.2 శాతంగా నిర్ణయించింది. అయితే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వృద్ధి రేటును 7.2 శాతంగా అంచనా వేసింది. స్టాటిస్టిక్‌ అండ్‌ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వ శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వృద్ధి రేటును 8.9 శాతంగా అంచనా వేసింది.

వరల్డ్‌ ఎకనామిక్‌ రిపోర్టును ఐఎంఎఫ్‌ మంగళవారం విడుదల చేసింది. అధిక చమురు ధరలు.. ప్రైవేట్‌ వినియోగం.. పెట్టుబడులపై ప్రభావం చూపుతాయని తెలిపింది. 2021-22 అంచనా వేసిన 1.5 శాతం ద్రవ్యలోటుతో పోలిస్తే.. 2022-23లో 3.1 శాతంగా ఉంటుందని తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. జనవరిలో భారత్‌ జీడీపీ వృద్ధి రేటు 7.1 శాతం అంచనా వేయగా.. దీన్ని 6.9 శాతానికి తగ్గించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement