Friday, November 22, 2024

ఇండియా వృద్ధిరేటు 7 శాతం.. ఎస్‌బీఐ అంచనా

దేశ ఆర్ధిక వ్యవస్థ 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఎస్‌బీఐ అంచనా వేసింది. తయారీ రంగం ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. 4వ త్రైమాసికంలో వృద్ధిరేటు 5.5 శాతం ఉంటుందని శుక్రవారం నాడు విడుదల చేసిన ఎస్‌బీఐ రిసెర్చ్‌ రిపోర్టు పేర్కొంది. మొత్తం ఆర్ధిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.1 శాతం ఉంటుందని అంచనా వేసింది. నేషనల్‌ స్టాటస్టికల్‌ ఆఫీస్‌(ఎన్‌ఎస్‌ఓ) జనవరిలో విడుదల చేసిన ముందుస్తు అంచనా నివేదికలో జీడీపీ 7 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. ఎస్‌బీఐ అంచనా దీని కంటే స్వల్పంగా అధికంగా ఉంది. దేశ వృద్ధిని వాస్తవంగా లెక్కించడం విధానకర్తలకు, రెగ్యులేటర్స్‌కు, ఆర్ధికవేత్తలకు ఒక సవాల్‌ అని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. ఈ వృద్ధి అంచనాలను 2022-23 ఆర్ధిక సంవత్సరంతో పాటు 2024,2025 ఆర్ధిక సంవత్సరాలకు కూడా ఉండాలని పేర్కొంది.

అంతర్జాతీయ పరిస్థితుల మధ్య వృద్ధి డ్రైవర్లపై సున్నాకి భిన్నమైన మార్గాన్ని అనుసరించడంలో మన దేశం తన ప్రగతిని కొనసాగిస్తుందని ఎస్‌బీఐ నివేదిక అంచనా వేసింది. మెరుగైన సామర్ధ్యాన్ని అందిపుచ్చుకునేందుకు సేవల రంగానికి మద్దతు ఇస్తూ, తయారీ రంగం పురోగతి కోసం చూస్తోందని తెలిపింది. స్థానికంగా, దేశీయ వినియోగం పెరిగేందుకు, పెట్టుబడులు, వ్యవసాయ రంగ అనుబంధ కార్యకలాపాలకు బలమైన అవకాశాలు, వ్యాపారం, వినియోగదారుల విశ్వాసాన్ని బలోపేతం చేయడం, ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతున్నందున సరఫరా ప్రతిస్పందనలు, వ్యవ పరిస్థితులు మెరుగుపడేందుకు సిద్ధంగా ఉన్నాయని, బలమైన రుణ వృద్ధిని పొందవచ్చని నివేదిక పేర్కొంది. 2023-24 కేంద్ర బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయం పెరుగుతుందని, ప్రైవేట్‌ పెట్టుబడులు పెరుగుతాయని, దీని వల్ల ఉపాధి కల్పన పెరుగుతుందని అంచనా వేసింది. దేశ వృద్ధిరేటును 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఆర్బీఐ 6.5 శాతంగా అంచనా వేసిందని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement