సంప్రదాయ వైద్యానికి భారత్ పుట్టినిల్లు అని, ఇక్కడ అపారమైన ఆయురేద వైద్య సంపద ఉందని ప్రధాని మోడీ అన్నారు. ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ దీన్ని గుర్తించిందని, అందుకే భారత్‌తో కీలక ఒప్పందం చేసుకుందన్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో డబ్ల్యూహెచ్ ట్రెడీషనల్ మెడిసిన్ గ్లోబల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ దేశాలను ఆరోగ్యపథంలో తీసుకెళ్లేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని, ఆరోగ్యమైన ప్రపంచ నిర్మాణానికి తోడ్పాటు అందిస్తుందని చెప్పుకొచ్చారు. ఇది భారత్‌కు గర్వకారణమని, ఆయుష్ మంత్రిత శాఖ ఆధర్యంలో డబ్ల్యూహెచ్‌ఓతో ఒప్పందం కూడా కుదిరినట్టు వివరించారు. యునైటెడ్ నేషన్స్ ఆరోగ్య ఏజెన్సీతో ఒప్పందంపై సంతకం కూడా చేసినట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన తాత్కాలిక కార్యాయలం గుజరాత్‌లోని ఆయురేద శిక్షణ, పరిశోధన సంస్థలో నెలకొల్పుతున్నట్టు తెలిపారు.
ఆయుర్వేదానికి పెట్టింది పేరు..
భారతీయ సంప్రదాయ వైద్యానికి ప్రపంచ వ్యాప్తంగా పేరుందని, ఆయుర్వేద ఔషధాలు, వెల్‌నెస్ పద్ధతులు చాలా దేశాలు అవలంబిస్తుంటాయని ప్రకటించారు. ఈ సెంటర్, సమాజంలో ఆరోగ్యాన్ని మరింత పెంపొందించడంలో చాలా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆధునిక సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంప్రదాయ వైద్యం సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం, అన్ని కమ్యూనిటీల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం ఈ కేంద్రం ప్రాథమిక లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని 80 శాతం ప్రజలు.. సంప్రదాయ ఔషధాలను ఉపయోగిస్తున్నారని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని ఏ దేశంలో అయినా.. లక్షలాది మంది ప్రజలు.. ముందుగా రోగికి సంప్రదాయ వైద్యం అందిస్తున్నారు. ప్రజలందరికీ.. సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్స అందుతుందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ అభిప్రాయపడ్డారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి...