ఆసిస్ తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 32 ఓవర్ లో కమిన్స్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ 18 పరుగులకి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం రాహుల్, సూర్యకుమార్ క్రీజ్ లో ఉన్నారు. 33 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
మొహాలీ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(52), జోష్ ఇంగ్లిస్(45), స్టీవ్ స్మిత్(41), మార్నస్ లబూషేన్(39) మాత్రమే రాణించారు. పేసర్ షమీ దెబ్బకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్ భారీ స్కోర్ చేయలేకపోయింది. తొలి స్పెల్‌లో ఓపెనర్ మిచెల్ మార్ష్(4), స్టీవ్ స్మిత్(41)లను ఔట్ చేసిన షమీ ఆసీస్ టాపార్డర్‌ను కూల్చాడు. ఆ తర్వాత రెండో స్పెల్‌లో మిడిల్ ఆర్డర్ పని పట్టాడు. డేంజరస్ ఆటగాళ్లు మార్కస్ స్టోయినిస్(29), మాథ్యూ షార్ట్(2)తో పాటు బౌలర్ సియాన్ అబాట్(2)లను పెవిలియన్ పంపి షమీ 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అతడు ఐదు వికెట్లు తీయడం ఇది రెండోసారి