Saturday, November 23, 2024

భారత ఫారెక్స్‌ నిల్వలు 561.16 బిలియన్‌ డాలర్లు

డిసెంబర్‌ 2తో ముగిసిన వారానికి భారత విదేశీ మారక నిల్వలు 11.02 బిలియన్‌ డాలర్లు పెరిగి 561.162 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ గణాంకాలు శుక్రవారం వెల్లడించాయి. నిల్వలు పెరగడం ఇది వరుసగా నాలుగో వారం. మునుపటి రిపోర్టింగ్‌ వారంలో, మొత్తం నిల్వలు 2.9 బిలియన్‌ డాలర్లు పెరిగి 550.14 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి. నవంబర్‌ 11తో ముగిసిన వారంలో, ఫారెక్స్‌ కిట్టి దాని రెండవ అత్యంత వేగవంతమైన వారపు త్వరణంలో 14.72 బిలియన్‌ డాలర్లు పెరిగింది. అక్టోబర్‌ 2021లో, దేశం యొక్క విదేశీ మారకపు విలువ 645 బిలియన్‌ డాలర్ల ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ప్రధానంగా ప్రపంచ పరిణామాల కారణంగా ఏర్పడిన ఒత్తిళ్ల మధ్య రూపాయిని రక్షించుకోవడానికి సెంట్రల్‌ బ్యాంక్‌ కిట్టీని మోహరించడంతో నిల్వలు క్షీణించాయి.శుక్రవారం ఆర్‌బిఐ విడుదల చేసిన వీక్లీ స్టాటిస్టికల్‌ సప్లిమెంట్‌ ప్రకారం, మొత్తం నిల్వలలో ప్రధాన భాగం అయిన విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సిఎ) డిసెంబర్‌ 2 నుండి వారంలో 9.694 బిలియన్‌ డాలర్లు పెరిగి 496.984 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

డాలర్‌ పరంగా వ్యక్తీకరించబడిన, విదేశీ కరెన్సీ ఆస్తులు విదేశీ మారక నిల్వలలో ఉన్న యూరో, పౌండ్‌ మరియు యెన్‌ వంటి %ీా%య్ఖేతర యూనిట్ల విలువ లేదా తరుగుదల ప్రభావాన్ని కలిగి ఉంటాయి. బంగారం నిల్వలు 1.086 బిలియన్‌ డాలర్లు పెరిగి 41.025 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ 164 మిలియన్‌ డాలర్లు తగ్గి 18.04 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ తెలిపింది. రిపోర్టింగ్‌ వారంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌)తో దేశ రిజర్వ్‌ స్థానం కూడా 75 మిలియన్‌ డాలర్లు తగ్గి 5.108 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని డేటా వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement